కాంగ్రెస్‌పార్టీ దొంగల ముఠా: ఎంపీ సుమన్

Fri,September 28, 2018 01:07 PM

రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలకు టీఆర్‌ఎస్‌పార్టీకి సంబంధం లేదని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ నేతల తీరు దొంగే దొంగ అన్న తీరుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ నాయకులు జనాల్లో సానుభూతి కోసం టీఆర్‌ఎస్ పార్టీ ఐటీ దాడులు చేయించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయంటే ఏదో ఉందన్నట్టే లెక్క.

తెలంగాణ తులసి వనంలో రేవంత్‌రెడ్డి గంజాయి మొక్క. అక్రమాలు, అవినీతి కేరాఫ్ అడ్రస్ రేవంత్‌రెడ్డి. రేవంత్ అక్రమ సంపాదనపై కాంగ్రెస్ నేతలు జవాబు చెప్పాలి. అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ నేతలు వంతపాడటం విడ్డూరంగా ఉంది. దావూద్ ఇబ్రహీం, చోటాషకీల్‌కు ఏమాత్రం తగ్గని వ్యక్తి రేవంత్‌రెడ్డి. రేవంత్‌రెడ్డికి వేలాది కోట్లు ఎలా వచ్చాయి. ఆదాయం పన్ను కట్టకుండా దేశాన్ని మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి ఒక దేశద్రోహి. ఎన్నికల్లో పోటీ చేయకుండా రేవంత్‌రెడ్డిని అనర్హుడిగా ఈ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉండటానికి రేవంత్‌రెడ్డికి ఏమాత్రం అర్హత లేదు.

రేవంత్‌రెడ్డి జైల్లో ఉండాల్సి వ్యక్తి. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి అక్రమాలు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి. బంధువులు, బినామీల పేరుమీద కోట్ల ఆస్తులు కూడబెట్టారు. రేవంత్‌రెడ్డి అక్రమాలన్నింటినీ దర్యాప్తు సంస్థలు బయటపట్టాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దొంగల ముఠా. నోట్లు పంచడం, చిల్లర రాజకీయాలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం. ఒక్కొక్కరి అవినీతి బాగోతం బయటపడుతుంటే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఆర్థిక ఉన్మాది రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించి రాహుల్‌గాంధీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు.

1314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles