బాలానగర్ ఫ్లైఓవ‌ర్‌తో 40 ఏండ్ల కష్టం తీరుతుంది..

Mon,August 21, 2017 05:11 PM

mp mallareddy says about balanagar fly over


మేడ్చల్: బాలానగర్ ఫ్లైఓవ‌ర్‌ నిర్మాణంతో 40 ఏండ్ల కష్టం తీరుతుందని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. ఫ్లైఓవ‌ర్‌ మంజూరు చేసిన సీఎంకు ఎంపీ మల్లారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఇవాళ మంత్రి కేటీఆర్ బాలానగర్ ఫ్లైఓవ‌ర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని పని కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఏడాదిన్నరలో ఫ్లైఓవ‌ర్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలంతో ఉందన్నారు. సిటీలో ఆరు నెలల్లో గుంతలు లేని రోడ్లు మనకు కనిపిస్తయన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

2165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles