భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎంపీ కవిత

Wed,March 20, 2019 02:49 PM

MP kavitha Speech   in Nizamabad

నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీతో సహా 17 పార్లమెంట్‌ స్థానాలను గెలిపించుకోవాలి. ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని కవిత వివరించారు. నిజామాబాద్ అర్బ‌న్ నియోజ‌క‌వర్గ నేత‌ల‌తోనూ స‌మావేశ‌మైన క‌విత అభివృద్ధి ప‌నుల‌పై చ‌ర్చించారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంపీ కవిత సమక్షంలో 100 మంది కాంగ్రెస్‌, టీడీపీ, మైనార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మేయర్‌ ఆకుల సుజాత, సుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles