మన పొలాలను ఎండబెట్టే కూటమి అది: ఎంపీ కవిత

Sat,November 17, 2018 09:20 PM

mp kavitha speaks to media in balkonda nizamabad dist

నిజామాబాద్: ప్రజా కూటమిలోని పార్టీలు తెలంగాణ మంచిని కోరుకోలేదు.. మన పొలాలను ఎండబెట్టే కూటమి.. మన ప్రాజెక్టును ఆపేసే కూటమి అది.. ఆ కూటమిని తిరస్కరించండి అంటూ ఎంపీ కవిత బాల్కొండ ప్రజలకు పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

"నాలుగున్నరేళ్లలో బాల్కొండ నియోజకవర్గంలో 2797.67 కోట్లను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే కాళేశ్వరం ప్యాకేజీ 21 కోసం 2623 కోట్లు కలుపుకొని 5,420 కోట్ల వరకు నాలుగున్నర ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వం వ్యయం చేసింది. కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లలో ప్రజల నుంచి నిధులను పన్నుల రూపంలో, ఇతరత్రా రూపంలో తీసుకోవడం తప్ప తిరిగి ఇచ్చింది లేదు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి. కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ కేసీఆర్ ను సీఎం చేయండి. బాల్కొండ ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డిని గెలిపించండి.. అని ఎంపీ కవిత బాల్కొండ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

668
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles