పసుపు బోర్డు కోసం లోక్‌సభలో పోరాడినా..

Tue,March 26, 2019 08:48 PM

జగిత్యాల: తెలంగాణలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని ఎంపీ కవిత తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం లోక్‌సభలో పోరాడినట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో ఎంపి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పసుపు రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పసుపు రైతులకు సబ్సిడీ అందించాం. పసుపు బోర్డు కోసం కేంద్రంపై ఎంతో ఒత్తిడి తెచ్చాం. అయినా నరేంద్రమోదీ సర్కార్‌ పట్టించుకోలేదు. పసుపు బోర్డు, పసుపు మద్దతు ధర, ఎర్రజొన్న మద్దతు ధర కోసం తొక్కని గడపలేదు, మొక్కని గుడి లేదు. పసుపు పంటకు మద్దతు ధర ఇచ్చే అంశం కేంద్రం పరిధిలో ఉంది. బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ వచ్చి చిలుకపలుకులు పలుకుతున్నాడని కవిత విమర్శించారు. రోడ్‌షోలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, భారీ సంఖ్యలో మహిళలు, గ్రామస్థులు హాజరయ్యారు.

2704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles