16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఢిల్లీని శాసించుకోవచ్చు: కవిత

Wed,March 20, 2019 08:02 PM

mp kavitha meeting with korutla constituency trs leaders

జగిత్యాల: 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంటే ఢిల్లీని శాసించుకోవచ్చని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. జిల్లాలోని మెట్‌పల్లిలో కోరుట్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులతో ఎంపీ కవిత సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసిన వారందరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం కవిత మాట్లాడుతూ.. రాష్ర్టాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుందన్నారు. దీన్ని మరిచిన బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసిందన్నారు. దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. గ్రామ శాఖలు, బూత్ కమిటీలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. దేశంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సాగునీటికి ఇబ్బంది ఉండదని కవిత స్పష్టం చేశారు.

1386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles