బోధన్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనం ప్రారంభం

Thu,October 12, 2017 05:58 PM

MP Kavitha inaugurated Govt junior college building in Bodhan

నిజామాబాద్: నూతనంగా నిర్మించిన బోధన్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనం ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే షకిల్‌తో కలిసి నిజామాబాద్ ఎంపీ కవిత జూనియర్ కాలేజీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. సమైక్య పాలకులు బోధన్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. బోధన్‌కు పూర్వవైభవం తీసుకురావడానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బోధన్‌లో రూ. 7 కోట్ల వ్యయంతో 10 ఎకరాల్లో స్టేడియంను నిర్మిస్తామని ఎంపీ తెలిపారు.

1675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS