నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత

Fri,March 22, 2019 03:22 PM

MP Kavitha files nomination for lok sabha polls from Nizamabad

నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎంపీ కవిత.. ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ కవిత, ఆమె భర్త అనిల్ ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ పత్రాలను హనుమంతుడి పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు కవిత.

సేవ చేసేందుకు ముందుంటా
మరోసారి పార్లమెంట్‌కు వెళ్లడానికి అవకాశం ఇస్తే.. సేవ చేసేందుకు ముందుంటానని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలో 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే.. తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం ఈ ఐదేండ్ల కాలంలో టీఆర్‌ఎస్ ఎంపీలందరూ ముందుండి కొట్లాడిండ్రు అని కవిత పేర్కొన్నారు.




1671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles