కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి: కవిత

Sat,March 23, 2019 02:54 PM

MP Kavitha election campaign in Jagtial Constituency

జగిత్యాల: కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత నేడు జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. సీఎం కేసీఆర్‌ వల్లే జగిత్యాల జిల్లా కేంద్రం అయింది. రైతుల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తలు నామినేషన్లు వేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమాతో రైతులకు అండగా ఉన్నాం. నిజమైన రైతులు కేసీఆర్‌ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారు. పసుపు బోర్డు కోసం నేను ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు. ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. గల్లీలో మీ సేవకులుగా ఉంటాం.. ఢిల్లీలో సైనికులుగా ఉంటమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పసుపు బోర్డు కోసం ఎంపీ కవిత ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతుల కోసం కృషిచేస్తున్న ఎంపీ కవితకు మద్దతు ఇవ్వాలన్నారు. కవితకు మద్దతుగా రైతులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు.

813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles