కారు నడిపిన ఎంపీ కవిత

Thu,November 15, 2018 08:54 PM

mp kavitha drives car in nizamabad

నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా కారు నడిపారు. నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా నామినేషన్ వేసే కార్యక్రమంలో భాగంగా ఆమె కారును నడిపారు. గులాబీ రంగు అంబాసిడర్ కారు డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత గాని అక్కడి ఉన్న నాయకులకు అర్థం కాలేదు. కవిత కారు నడపబోతున్నారని.

గణేశ్ అన్నా కారెక్కండి అనగానే గణేశ్ గుప్తా ముందు సీట్లో కూర్చున్నారు. ఇంకేముంది మారుతీనగర్‌లోని బిగాల ఇంటి నుంచి సుమారు రెండున్నర కిలో మీటర్ల దూరంలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ వరకు గేర్ల మీద గేర్లు మార్చుకుంటూ కారు వేగం పెంచారు. వాహనదారులు సైతం ఎంపీ కవిత డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు మొబైల్ ఫోన్లను పట్టుకున్నారు. మీడియా ప్రత్యేక వాహనంలో ఎంపీ కవితను ఫాలో అయ్యారు. మొత్తానికి నిజామాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బిగాల గణేశ్ గుప్తా చేత నామినేషన్ వేయించేందుకు కారులో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు ఎంపీ కవిత స్వయంగా తీసుకుని వెళ్లడంపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది.

2404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles