ఓటేసిన ఎంపీ కవిత దంపతులు

Thu,April 11, 2019 09:16 AM

MP Kavitha couple cast their votes in Pothangal

నిజామాబాద్: ఎంపీ కవిత దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ పోలింగ్ బూత్‌లో ఎంపీ కవిత దంపతులు ఓటేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందన్నారు. కావునా పట్టణ ఓటర్లు తప్పకుండా ఓటేయాలని కోరుతున్నట్లు ఆమె చెప్పారు. ఏ పార్టీకి ఓటు వేస్తామన్నదానికన్నా ముఖ్యంగా ఓటు వేయడం అన్నది ముఖ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రతిఒక్కరూ దయచేసి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

1260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles