గొల్ల కురుమలు బాగుంటే ఊరు బాగుంటది: ఎంపీ కవిత

Wed,June 13, 2018 09:17 PM

MP Kavitha attends Yadavs meeting in bodhan

నిజామాబాద్ : నీతి, నిజాయితీకి గొల్ల కురుమలే ఆదర్శమని ఎంపీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. గొర్రె బాగుంటే గొల్ల కురుమలు బాగుంటారని, గొల్ల కురుమలు బాగుంటే ఊరు బాగుంటుందని ఎంపీ కవిత అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించిన గొల్ల కురుమల కృతజ్ఞత సభకు ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క కుల సభ్యులు పాల్గొన్నారని..సీఎం కేసీఆర్ అన్ని కులాలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఏ పని చేసినా అందరికి ఉపయోగపడేలా ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో జాగృతి ఏర్పాటు చేసినప్పుడు 1200 మంది గొల్ల కురుమలకు రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నించానని..ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తెలంగాణ వస్తేనే న్యాయం జరుగుతుంది అనుకున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ గొల్ల కురుమల సమస్యలను తీర్చుతామని భరోసా ఇచ్చారు.

నిజామాబాద్ లో గొల్ల కురుమల మార్కెట్ కోసం 30 ఎకరాలు భూమి కేటాయించామని తెలిపారు. బోధన్ లో గొల్ల కురుమల భవనం కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల్లో గొల్ల కురుమలకు భవనాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. త్వరలోనే మటన్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత ప్రకటించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

1999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles