మేడారం జాతరకు జాతీయ హోదా కోసం పార్లమెంట్‌లో ఒత్తిడి తెస్తాం

Sat,February 23, 2019 08:05 PM

mp jithender reddy offers prayers at medaram temple

-టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్
ములుగు: మేడారం సమ్మక్క-సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా తీసుకొచ్చేందుకు పార్లమెంట్‌లో ఒత్తిడి తెస్తామని టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు.

ఇవాళ వాళ్లు మేడారం సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి ఎత్తు బంగారంతో తల్లులకు మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో మేడారానికి జాతీయ హోదాను రెండు మూడు నెలల్లో తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న అద్భుతమైన పథకాలు దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని అద్భుత పథకాలతో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అందరూ తెలంగాణ వైపు చూసే విధంగా చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించే విధంగా చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఆశీస్సులు అందించాలని దేవతలను కోరుకున్నట్లు వివరించారు.

1244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles