పండుగలా వ్యవసాయం..రైతును రాజు చేయడమే లక్ష్యం..

Mon,March 19, 2018 07:53 PM

MP Guttha Sukhenderreddy says about Farmers, Agriculture


నల్లగొండ: వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతును రాజును చేయడమే రైతు సమన్వయ సమితుల లక్ష్యమని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో గుత్తాసుఖేందర్ మాట్లాడుతూ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ లో అధిక నిధులను కేటాయించారని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు రూ. 50 వేల కోట్లను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ దని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, వరి నాటు యంత్రాలను అడిగిన వారందరికి అందిస్తామని గుత్తాసుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో ఆగ్రో ప్రాసెస్ యూనిట్లను నెలకొల్పుతున్నామన, రైతు వేదికలను త్వరితగతిన నిర్మిస్తున్నామని అన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచే రైతులకు పెట్టుబడి సాయం పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూసి దేశంలోని పలు రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు.

1931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS