కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు..

Mon,October 1, 2018 04:42 PM

MP gutta sukhender reddy fire on Motkupally Narasimhulu

యాదాద్రి భువనగిరి : మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులపై రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 25 ఏళ్లు ఏకధాటిగా ఆలేరు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తులు.. ఈ రోజు గోదావరి జలాల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కసారి గెలిపిస్తే గోదావరి జలాలు తెస్తానని కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు. ఇవే చివరి ఎన్నికలంటూ కల్లబొల్లి మాటలు చెప్తూ జనం ముందుకు వస్తున్నారు.. అలాంటి వారి జాగ్రత్తగా ఉండాలని గుత్తా హెచ్చరించారు. ఆలేరు నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావాలంటే కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతుందన్నారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. ఆలేరు నియోజకవర్గం అంటే కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.

2673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles