ఓయూ, కేయూ విద్యార్థి సంఘాలతో చర్చకు సిద్ధం: ఎంపీ బండ

Sat,October 20, 2018 01:51 PM

mp banda prakash praises cm kcr over  rythu bandhu

వరంగల్ అర్బన్: విద్యా, ఉద్యోగ నియామకాలలో ఓయూ, కేయూ విద్యార్థి సంఘాలతో చర్చకు సిద్ధమని ఎంపీ బండ ప్రకాష్ తెలిపారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం రైతులు ఇబ్బందిపడ్డారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులు సంతోషంగా ఉన్నారని ఎంపీ వివరించారు.

2847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS