అది మ‌హాకూట‌మి కాదు.. దొంగ‌ల కూట‌మి!

Fri,October 12, 2018 07:37 PM

mp balka suman slams Mahakutami

మంచిర్యాల: దేశంలో తెలంగాణ రాష్ట్రం 17.17శాతం వృద్ధిరేటుతో నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచిందని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 450 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. మహాకూటమి ఓ దొంగల కూటమి అని అభివర్ణించారు. మహాకూటమి మాటలను నమ్మి ఆంధ్రోళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టొద్దని కోరారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు తెలంగాణకు కరెంట్, నీళ్లు రావని చెబుతూ.. అభివృద్ధిని అడ్డుకున్నారని గుర్తుచేశారు. మహాకూటమి ద్వారా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. దొంగల కూటమికి అవకాశమిస్తే అభివృద్ధి ఆగిపోతుందని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్సే విజయం సాధిస్తుందని చెప్పారు.

1584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS