కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కవు: ఎంపీ బాల్క సుమన్

Mon,September 3, 2018 05:54 PM

MP BALKA SUMAN fire in congress party

హైదరాబాద్: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభ జరిగిందని ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయి. 2001 నుంచి 2014 వరకు టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎన్నో బహిరంగ సభలు జరిగాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడే కొత్తగా సభ నిర్వహించినట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరికాదు. సభకు వచ్చిన జనాన్ని చూసి కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదిలిపోయింది. కాంగ్రెస్ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన స్కాంలను, ద్రోహాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. టీఆర్‌ఎస్‌పై అనవసర విమర్శలను ఇకపైన మానుకోవాలి. లేదంటే ప్రజాక్షేతంలో ప్రజలే ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని తేల్చి చెప్పారు.

1531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS