ఘనంగా బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

Wed,June 13, 2018 05:22 PM

MP Badugula Lingaiah yadav birthday celebrations

సూర్యాపేట: టీఆర్‌ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదినం నేడు. ఎంపీ పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ మార్కెట్ ఛైర్మన్ శశిధర్‌రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ గండూరి ప్రవళిక వేడుకకు హాజరై బడుగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు బడుగుల శ్రీనివాస్ యాదవ్, బత్తుల దయాకర్ రెడ్డి, తండు నాగులు గౌడ్, తుమ్మనగోటి సాగర్, పట్టేటి విద్యాసాగర్, నిమ్మల శ్రీనివాస్, వై . వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని కార్యకర్తలు బడుగుల లింగయ్యకు ఆయన చిత్రపటాన్ని బహూకరించారు.

1610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS