నంది మేడారం పంప్‌హౌస్‌లో మూడు గంటలు నడిచిన మోటర్లు

Thu,April 25, 2019 09:25 PM

motors in nandi medaram pump house run for 3 hours

- 0.035 టీఎంసీల నీరు ఎత్తిపోత
- 0.345 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం
- కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు వెల్లడి


కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నంది మేడారం పంప్‌హౌస్‌లో రెండు రోజుల్లో రెండు మోటర్లను మూడు గంటలపాటు నడిపారు. బుధవారం మొదటి మోటరును గంటసేపు నడిపిన అధికారులు గురువారం రెండు గంటల పాటు దిగ్విజయంగా నడిపించారు. రెండు రోజుల్లో మూడు గంటల పాటు మోటర్లను నడిపి 0.035 టీఎంసీల నీటిని సర్జ్‌పూల్ నుంచి మేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తి పోశారు.

మూడు గంటలపాటు నడిచిన మోటర్లకు సంబంధించి మొత్తం 0.345 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. అంటే 3,45,000 యూనిట్లు విద్యుత్ వినియోగం అయింది. ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ.5.80 చొప్పున లెక్క వేస్తే రూ.20,01,000 లక్షల విలువ గల విద్యుత్ వినియోగమైనట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు.

1436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles