రైల్వే ట్రాక్‌పై మోటర్ సైకిల్

Sat,March 23, 2019 09:58 PM

Motorcycle on railway track

మహబూబాబాద్ : రైల్వే ట్రాక్‌పై మోటార్ సైకిల్ వదిలి వెళ్లిన సంఘటన మహబూబాబాద్, తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 433 మైలురాయి వద్ద చోటు చేసుకుంది. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. రైల్వే ట్రాక్‌పై డెహ్రాడూన్ సూపర్ ఫాస్ట్ రైలు వెళ్తున్న క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్‌ను ట్రాక్‌పై వదిలి వెళ్లారు. రైలు బైక్‌ను ఢీకొట్టడంతో సాంకేతిక సమస్య తలెత్తి రైలు సుమారు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి యథావిధిగా రైలును పంపించినట్లు అధికారులు తెలిపారు. కాగా మోటార్ సైకిల్ ఎవరిదనే విషయమై జీఆర్‌పీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

4075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles