కూతురితో సహా తల్లి ఆత్మహత్య

Tue,July 23, 2019 10:21 PM

Mother suicide with daughter

బొమ్మలరామారం: కుటుంబ కలహాలతో కూతురితో సహా మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని పాత రంగాపూర్‌లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత రంగాపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్యాంసుందర్‌రెడ్డితో పెద్దపర్వతాపూర్ గ్రామానికి చెందిన హైమావతికి(25) రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కూతురు నందిక ఉంది. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య కలహాలు తలెత్తడంతో మర్రి హైమావతి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనతోపాటు కూతురు నందికపై కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. అదే సమయంలో వ్యవసాయం పొలం నుంచి ఇంటికి వచ్చిన భర్త శ్యాంసుందర్‌రెడ్డి తలుపులు తీసి చూడగా అప్పటికే హైమామతి మృతి చెంది ఉండగా, కాలిన గాయాలతో నందిక కొట్టుమిట్టాడుతుండగా వెంటనే వైద్యశాలకు తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఇదిలా ఉంటే తల్లీకూతుర్ల మరణానికి భర్త శ్యాంసుందర్‌రెడ్డి, అత్తమామల వేధింపులే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఫర్నిచర్‌ను తగలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై మధుబాబు తెలిపారు.

517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles