విద్యుత్‌షాక్‌తో తల్లీకూతుళ్ల మృతి

Tue,November 14, 2017 10:18 PM

mother daughter killed by electric shock

రామాయంపేట : విద్యుత్ షాక్‌తో తల్లీ కూతుళ్లు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లవ్వకు ఇద్దకు కుమార్తెలు. పెద్ద కుమార్తె రాజవ్వను ఇల్లరికం తీసుకొచ్చారు. చిన్నకుమార్తె భూదవ్వ కూడా ఇంటి వద్దే ఉంటోంది. పొలం వద్ద భూదవ్వ(40) స్టార్టర్ ఆన్‌చేయ బోగా వైర్లు తేలి ఉండడంతో కరెంటుషాక్‌కు గురైంది. ఆమె కేకలు విన్న తల్లి భూదవ్వ కూడా హుటాహుటిన వచ్చి కూతురును పట్టుకోగా ఇద్దరూ విద్యుదాఘాతంతో మృతిచెందారు. ఒకే కుటుంబంలో తల్లీకూతుళ్లు మృతిచెందడంతో విషాదచాయలు అలుముకున్నాయి.

654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS