అనుమానస్పద స్థితిలో తల్లి, కూతురు మృతి

Mon,April 8, 2019 09:23 PM

Mother and daughter died in suspicious status

కొత్తకోట : అనుమానస్పద స్థితిలో తల్లి, కూతురు మృతిచెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన తెలుగు సవరయ్య, జానకమ్మల కూతురు తెలుగు నిర్మల (35) పాలెం గ్రామానికి చెందిన తెలుగు నర్సింహకు ఇచ్చి పదేళ్ల కిందట వివాహం చేయగా, వీరిద్దరికి 8 ఏళ్ల సింధు అనే కూతురు ఉంది. కాగా, అనారోగ్యంతో బాధపడుతూ రెండేళ్ల కిందట నర్సింహ మృతి చెందగా, అప్పటి నుంచి నిర్మల తన కూతురు సింధుతో కలిసి తల్లిగారి ఇంట్లో ఉంటున్నది. ఉగాది సందర్భంగా పెద్దలకు నైవేద్యం పెట్టడానికి పాలెం గ్రామానికి తన కూతురుతో కలిసి నిర్మల వచ్చింది. ఈ క్రమంలో కూతురు అనుమానస్పద స్థితిలో మృతి చెందగా, ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా, కత్తి ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మృతురాలి అన్న నాగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

3217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles