ప్రమాదవశాత్తు కుంటలో పడి తల్లీకూతురు మృతి

Tue,May 14, 2019 06:46 PM

mother and daughter died in pond water

గోపాల్‌పేట : ప్రమాదవశాత్తు కుంటలో పడి తల్లీకూతురు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పూసల మాణిక్యమ్మ(25) భర్త వదిలేయడంతో కూతురు రుక్మిణి (6)తో కలిసి తల్లి ఈశ్వరమ్మ వద్ద ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. బట్టలు ఉతికేందుకు కూతురితో కలిసి మధ్యాహ్నం ఊరి సమీపంలోని రెడ్ల కుంటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి ప్రాణాలు వదిలారు. ఇంటి వద్ద సమాచారం ఇవ్వకుండా వెళ్లిన కూతురు మనుమరాలు వరకు ఎంతకీ ఇంటికి రాకపోయే సరికి మృతురాలి తల్లి అంతటా వెతికింది. స్థానికులు రెడ్లకుంట వద్ద బకెట్, బట్టలు, చెప్పులు గుర్తించి కుంటలోకి దిగి గాలించగా తల్లీకూతుళ్లు శవమై కనిపించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామ నిర్వహించి మృతదేహలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

1994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles