రవి ప్రకాశ్ కేసులో సైబర్‌క్రైమ్ పోలీసులకు మరిన్ని ఆధారాలు

Thu,May 16, 2019 11:12 AM

More evidence for cyber crime police in the Ravi Prakash cheating case

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. మరిన్ని ఆధారాలతో రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని సమాచారం. ఎన్‌సీఎస్‌టీలో కేసు కోసం పాత తేదీల్లో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చకున్నట్లు ఆధారాలు లభించాయి. శక్తి, ఎంకేవీఎస్ మూర్తి, రవిప్రకాశ్, హరి మధ్య బదిలీ అయిన పలు ఈ మేయిళ్లను వెలికితీశారు. ఈ మేయిళ్లు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు తొలగించారు.

అత్యాధునిక పరిజ్ఞానంతో తొలగించిన ఈ మెయిళ్లను సైబర్‌క్రైం పోలీసులు వెలికితీశారు. రవిప్రకాశ్ నుంచి 2018 ఫిబ్రవరి 20వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. 40వేల షేర్ల కొనుగోలుకు శివాజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు క్రియేట్ చేశారు. ఒప్పంద ముసాయిదాను వాస్తవానికి 2019 ఏప్రిల్ 13న తయారు చేసినట్లు గుర్తించారు. వీరందరి మధ్య మెయిళ్ల బదిలీ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వీటి ఆధారంగా సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఎన్‌సీఎల్‌టీలో జరగబోయే విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

1337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles