వారం రోజుల్లో తెలంగాణకు రుతుపవనాలు

Sun,June 9, 2019 06:37 AM

Monsoons comes to Telangana within a week says weather department

హైదరాబాద్ : రుతుపవనాలు ఈ నెల 11న తెలుగు రాష్ర్టాల్లోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి వస్తాయని, 13 లేదా 14న తెలంగాణకు విస్తరిస్తాయని వెల్లడించారు. మరోవైపు శనివారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, జనగామ, రంగారెడ్డి, నల్లగొండ, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 5-8 సెం.మీ.ల వరకు వాన కురిసిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఉపరితల ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో పగటి ఊష్ణ్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. భద్రాచలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.2, హన్మకొండలో 38.5, హైదరాబాద్‌లో 34 డిగ్రీలుగా నమోదుకాగా, ఆదిలాబాద్‌లో మాత్రం 44.3 డిగ్రీలు నమోదైంది. అయితే.. నైరుతి రుతుపవనాలు విస్తరించే వరకు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.

3881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles