షాపును మూసేసి డబ్బులు తీసుకొని వెళ్తుండగా..

Wed,October 17, 2018 07:57 AM

money theft from a man in uppal

హైదరాబాద్ : షాపును మూసివేసి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తున్న వ్యాపారి దృష్టిమరల్చి, మాటల్లో పెట్టి డబ్బులు కాజేసిన ఇద్దరు యువకులను మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో బాలుడిని జువైనల్‌హోంకు తరలించారు. ఈ సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నాచారంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో రాచకొండ క్రైం డీసీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా, కీసర మండలం, నాగారానికి చెందిన రాయ్‌చాంద్ అగర్వాల్ అక్టోబర్ 12న నాగారం, ఎస్పీనగర్‌లోని స్టీల్‌షాపును మూసివేసి రూ.1.5లక్షలను తీసు కొని ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి సమీపంలో గేటు వద్ద ముగ్గురు వ్యక్తులు వచ్చి మాటల్లో పెట్టి నగదు చోరీ చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాగారం ప్రాంతంలో నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న జవహర్‌నగర్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన బండారి రాజు(20) అలియా స్ థామస్, సెంట్రింగ్ పనులు చేసే నాగారం సత్యనారాయణకాలనీకి చెందిన ముక్కెర నవీన్(19), మరో బాలుడు కలిసి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈమేరకు వారిని అదుపులోకి తీసుకొని కీసర పోలీసులకు అప్పగించారు. బాలుడిని జువైనల్‌హోంకు పంపించారు. ఈ కార్యక్రమంలో సీఐ లింగయ్య, ఎస్సై వెంకటేశ్వర్లు, క్రిష్ణారావు, మల్లారెడ్డి, సిబ్బంది లింగయ్య, బ్రహ్మం, నర్సింగ్‌రావు, వెంకటరాముడు, నర్సింహులు, శ్రీకృష్ణ, పూర్ణిమ పాల్గొన్నారు.

2509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles