ఎస్‌బీఐ అకౌంట్‌లో దాచిన నగదు మాయం

Fri,March 8, 2019 08:23 PM

money from sbi account withdrawn by cyber criminals in rajanna sircilla dist

- ఖాతా నుంచి 6 రోజుల్లో రూ.1,13,500 కాజేత
- న్యాయం చేయాలని బ్యాంకు ఎదుట బాధితుడి నిరసన

రాజన్న సిరిసిల్ల: ఎస్‌బీఐ ఖాతా పుస్తకం, ఏటీఎమ్ కార్డు ఖాతాదారుడి వద్దనే ఉన్నా ఖాతా నుంచి వరుసగా ఆరు రోజుల నుంచి వేరొక ఏటీఎం కార్డు ద్వారా కాజేశారు. బీహార్ రాష్ట్రంలోని ఏటీఎం కేంద్రంలో రోజుకు 20 వేల చొప్పున 1,13,500 రూపాయలను కాజేసిన సంఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన పిట్ల నర్సింలు ఎస్‌బీఐలో తన ఖాతాపై రూ.1,13,500ను దాచుకున్నాడు. తనకు కొంత నగదు అవసరం ఉందని బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో బ్యాలెన్సు లేదని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అయోమయంలో పడిన నర్సింలు బ్యాంకు అధికారులపై ఆగ్రహించాడు.

ఏటీఎమ్ కార్డు ద్వారా బీహార్ రాష్ట్రంలో ఏటీఎం కేంద్రంలో ఆరు రోజుల నుంచి 20 వేల చొప్పున డబ్బులు తీసుకున్నావని బ్యాంకు సిబ్బంది సమాధానం ఇచ్చారు. కార్డు మంజూరైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటీఎమ్ కార్డు ఉపయోగించలేదని బాధితుడు బ్యాంకు ఎదుట మొరపెట్టుకున్నాడు. తన డబ్బులు ఇప్పించాలని బ్యాకు మేనేజర్‌ను కోరగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుపోతానని తెలిపారు. తన ఖాతా నుంచి దొంగలించిన నగదును అందించాలని స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

2665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles