మోదీ, అమిత్‌షా ప్రచార షెడ్యూల్ ఖరారు

Sun,November 18, 2018 09:16 AM

Modi and Amit Shah election campaign schedule in Telangana

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచార షెడ్యూల్ ఖరారయింది. ప్రధాని నరేంద్రమోదీ ఆరు సభల్లో పాల్గొంటుండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 12 సభల్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 25, 27, 28 తేదీల్లో అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగుసభల చొప్పున మొత్తం 12 సభల్లో ఆయన పాల్గొనేలా బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ డిసెంబర్ 3, 5 తేదీల్లో ఆరుసభల్లో పాల్గొంటారని సమాచారం. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే అగ్రనేతల సభలను ఏర్పాటుచేశారు. దీనిపై త్వరలో బీజేపీ అధికారిక ప్రకటన చేయనున్నది.

1078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles