48 గంటల్లో ఓ మోస్తరు వానలు

Sun,October 13, 2019 07:01 AM

హైదరాబాద్ : లక్షద్వీప్ ప్రాంతం నుంచి ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనంగా మారింది. దీంతో ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచే గాలులు వీస్తున్నాయి. రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై కరుణాకర్‌రెడ్డి తెలిపారు.


నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ నెలాఖరు వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనం మొదలైందన్నారు. కానీ తెలంగాణలో రుతుపవనాల తిరోగమనం ఈనెలాఖరు తర్వాతే ఉంటుందన్నారు. అప్పటివరకు తరుచూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు.

1329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles