సంచార పశు వైద్యశాలలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Fri,September 15, 2017 05:30 PM

mobile veterinary clinics inaugurates by cm kcr

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం సంచార పశు వైద్యశాల వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. అంబులెన్స్ లోని వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం 1962 టోలో ఫ్రీ నెంబర్ కలిగిన జెండాను ఊపి వాహనాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ర్ట గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ రాజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

-రాష్ర్ట వ్యాప్తంగా నేటి నుంచి 100 సంచార పశువైద్యశాలలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాల అందుబాటులో ఉండనుంది. సంచార పశు వైద్యశాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ - 1962.

-రైతులు తమ పశువులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు, పశువులు లేదా గొర్రె, మేకలు ప్రమాదానికి గురైనప్పుడు లేదా అటవీ జంతువుల బారిన పడినప్పుడు 1962 నెంబర్ కు కాల్ చేస్తే 30 నిమిషాల సమయంలో వైద్య సేవలు అందిస్తుంది.

-ప్రతి సంచార పశు వైద్యశాల వాహనములో ఒక నిపుణుడైన పశు వైద్యుడు, పశు వైద్య సహాయకుడు మరియు సహాయకుడు ఉంటాడు.

-సంచార పశు వైద్యశాల వాహనములో అత్యవసర పశు వైద్య సేవల నిమిత్తము అవసరమైన మందులు, టీకాలు, ఆపరేషన్లకు అవసరమయ్యే పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మరియు కృత్రిమ గర్భోత్పత్తి అందించబడుతాయి.

-ఈ సంచార పశువైద్యశాల ద్వారా అన్ని రకాల పశువులకు రోగ నిర్ధారణ మరియు చికిత్స సేవలందించబడుతాయి.

-ఈ సంచార పశు వైద్యశాల నిర్వహణ మరియు మందుల కొనుగోలుకు రూ. 30 కోట్లు కేటాయింపు చేసి రైతులకు ఉచిత సేవలు అందించబడును.

2982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles