సీఎం కేసీఆర్ గిరిజనుల గుండెల్లో ఉన్నారు..

Fri,May 24, 2019 10:16 PM

mlc satyavathi rathod praises cm kcr

ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
మహబూబాబాద్: ఆదివాసీ గిరిజనులు సీఎం కేసీఆర్‌ను హృదయాల్లో నింపుకున్నారని ఎమ్మెల్సీ, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి సత్యవతి రాథోడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఎంపీ మాలోతు కవిత నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కవితతో కలిసి ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్.. మహబూబాబాద్ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇస్తూ మీరు తప్పక విజయం సాధిస్తారని ఆశీర్వదించినట్లు గానే మహబూబాబాద్ ప్రజలు ఆశీర్వదించి 1,46,663 మెజార్టీ ఇచ్చారని అన్నారు. తమపై నమ్మకముంచి పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, పార్టీ కార్యకర్తలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles