ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ షురూ

Fri,May 31, 2019 08:46 AM

MLC polling started in telangana


హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. వరంగల్‌ లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మి పోటీలో నిలిచారు. రంగారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

1493
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles