నాలుగున్నర ఏళ్లలోనే 40 ఏళ్ల అభివృద్ధి..

Thu,November 8, 2018 08:54 PM

MLC Palla rajeswar visits gadwala, alampur areas

జోగులంబ గద్వాల: గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. గద్వాల మండలం రేపల్లె, ఈడిగీని పల్లె గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరినవారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి ప్రతి పథకం నేరుగా లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.

ఆసరా పెన్షన్, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, వికలాంగులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో రైతుకు స్వర్ణ యుగం లాంటిదని, రైతును రాజు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నడిగడ్డ అభివృద్ధికి నోచుకోలేదని.. కేవలం నాలుగున్నర ఏళ్లలోనే 40 ఏళ్ల అభివృద్ధి సాధించిందని తెలిపారు. కులవృత్తులు మరుగున పడిపోయాయని మత్స్యకారులకు, గొల్ల కురుమలకు చేయూత నిచ్చారన్నారు. ఈసారి గద్వాల జిల్లాలో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. గద్వాలలో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

1565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS