కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ పల్లా ఫైర్

Tue,June 18, 2019 05:32 PM

MLC Palla rajeshwarreddy fires on congress leaders


ఖమ్మం : కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికాలేదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఓ చరిత్రాత్మక ఘట్టమని పల్లా తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ..భారీ ప్రాజెక్టు ఇంత త్వరగా పూర్తికావడం టీఆర్ఎస్ పాలనా దక్షతకు నిదర్శనమన్నారు.

ప్రతిపక్షాలు అడ్డుపడినా చిత్తశుద్ధితో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ పల్లా స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ నేతల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దేశంలో లేనివారు, భూములు లేనివారితో కేసులు వేయించి కావాలనే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అడ్డుపడాలని చూస్తున్నారని, వారిని తెలంగాణ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ప్రాణహిత చేవెళ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.

1721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles