కాంగ్రెస్ నేతలకు ఇంగితజ్ఞానం లేదు : ఎమ్మెల్సీ కర్నె

Mon,January 22, 2018 12:28 PM

MLC Karne Prabhaker fire on Congress Party Leaders

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ నేతలకు ఇంగితజ్ఞానం లేదని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న గవర్నర్‌పై కామెంట్స్ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గవర్నర్ పదవిని రబ్బర్‌స్టాంప్‌గా మార్చిందే కాంగ్రెస్ అని ఎమ్మెల్సీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గవర్నర్ మెచ్చుకుంటుంటే.. కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్‌ను ప్రశంసిస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించడం సరికాదన్నారు. గవర్నర్లను అడ్డంపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. గవర్నర్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చింది కాంగ్రెస్సేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.

1236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles