కాళేశ్వరం రైతుల కాళ్లు కడిగి కన్నీళ్లు తుడుస్తుంది

Sat,June 15, 2019 02:57 PM

mlc karne prabhakar fires on congress leaders

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల కాళ్లు కడిగి.. కన్నీళ్లు తుడుస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల తీరును ఖండిస్తూ ఆయన నేడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలోనే కాళేశ్వరం అద్భుత ప్రాజెక్టు అన్నారు. కాళేశ్వరంను స్వాగతించాల్సిందిపోయి కాంగ్రెస్ నేతలు దుర్బుద్దిని ప్రదర్శిస్తున్నారన్నారు. ఏపీ సీఎం జగన్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావోద్దనటం విడ్డూరమన్నారు. గతంలోనూ ప్రధాని మోదీని మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావోద్దని ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖ రాశారన్నారు. ఇంటింటికి నీళ్లు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను చేపట్టారన్నారు. ప్రాజెక్టులు నిర్మించినప్పుడు నిర్వాసితులు ఉండటం సహజమేనని.. నిర్వాసితులకు మంచి ప్యాకేజి ఇచ్చినా.. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కేసులు వేశారన్నారు. కాంగ్రెస్ నేతలు రాజనీతిని ప్రదర్శించడం లేదన్నారు.

2079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles