బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి: కర్నె

Sat,April 23, 2016 01:57 PM

mlc karne prabhakar fires on bjp president doctor lakshman

హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మన్ చేసిన విమర్శలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 22 నెలల పాలనలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు.

కేజీ టు పీజీ తప్ప ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామన్నారు. తమ ప్రభుత్వం అన్ని చేసి చూపించిందన్నారు. కానీ ప్రతిపక్షాలు ఏమీ చేయలేదనేందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని వివరించారు. ఢిల్లీలో తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టానికి ఏమీ చేయలేని బీజేపీ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారని ధ్వజమెత్తారు.

హిమాచల్ వలెనే మనకు పన్ను రాయితీ ఇవ్వాలని కోరితే బీజేపీ నేతలు అడగరని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడే నాథుడేలేడని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా అడిగితే ఉలుకుపలుకు లేదని మండిపడ్డారు. పాలేరులో ప్రతిపక్షాలు కేవలం డిపాజిట్ల కోసం పోరాటం చేయాల్సిందే తప్ప గెలుపు ఆశలు లేవని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ గురించి ప్రతిపక్షాలేదో కొత్తగా చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు.

1238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles