నేడే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

Fri,May 31, 2019 08:25 AM

MLC election to held today in medchel


మేడ్చల్‌ జిల్లా: శుక్రవారం జరుగనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లాలో మొత్తం 188 ఓట్లుండగా, ఇందులో కీసర ఆర్డీవో పరిధిలో 125 ఓట్లు (మహిళలు-67, పురుషులు-58), ఒక్క ఎమ్మెల్సీ, 12 మంది కార్పొరేటర్లు, 108 మంది ఎమ్మెల్సీలు, 4 మంది జడ్పీటీసీలున్నారు. అలాగే మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 63 ఓట్లు ఉండగా, వీరిలో 29మంది కార్పొరేటర్లు, 33 మంది ఎంపీటీసీలు, ఒక్క జడ్పీటీసీ ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లాలో రెండు పోలింగ్‌ కేంద్రాలుండగా, ఇందులో కీసర రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఒక్కటి, మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఒక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆర్డీవోలు వి.లచ్చిరెడ్డి, మధుసూదన్‌ తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్డీవోలు తెలిపారు.

1170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles