ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Fri,March 22, 2019 08:49 AM

MLC Election polling started


హైదరాబాద్ : కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌; వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోని కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది.

అధికారులు ప్రతి వెయ్యిమంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 472 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 185 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు.


924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles