రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Thu,March 21, 2019 07:23 AM

హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం, మెదక్-నిజామాబాద్ -కరీంనగర్-ఆదిలాబాద్, వరంగల్- ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లకు ఎన్నికల కమిషన్ ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నది.

స్పాట్ వ్యాల్యుయేషన్‌లో ఉన్నవారికీ ఓటేసే అనుమతి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు స్పాట్ వాల్యూయేషన్‌లో ఉన్న ప్రధానోపాధ్యాయులు, లెక్చరర్లు, ఉద్యోగులకు అనుమతి లభించింది. ఈ మేరకు సీఈవో రజత్‌కుమార్ స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను మంజూరు చేశారు. అర్హులైన వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

1919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles