ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

Tue,March 26, 2019 08:39 AM

MLC election Counting start

కరీంనగర్ : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 14, ఉపాధ్యాయ స్థానం లెక్కింపునకు మరో 14 టెబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌కు 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించినట్లు ఎన్నికల అధికారి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ లెక్కన ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19,376 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

ఈ ఓట్లను రెండు రౌండ్లలో పూర్తి చేసి మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీకి 1,16,156 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కన ప్రిలిమినరిగా తొమ్మిది రౌండ్లు లెక్కిస్తారు. అప్పటికి ఫలితం తేలకుంటే సబ్ పార్సిల్ పద్ధతిలో ఓట్లు లెక్కించి ఫలితం తేల్చుతారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కోసం 36 మంది సూపర్‌వైజర్లు, 64 మంది అసిస్టెంట్ సూపర్‌వైజర్లు, 35 మంది మైక్రో అబ్జర్వర్లు, 4 ఇన్‌చార్జిలు, వీరికి 15 మంది అసిస్టెంట్లు, 11 మంది ట్యాబ్‌లైషన్ సిబ్బంది, మరో నలుగురు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సిబ్బందిని ఏర్పాటు చేశారు.

150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా 600 మంది సిబ్బంది కౌంటింగ్ కోసం విధులు నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల స్థానంలో 17 మంది, ఉపాధ్యాయ స్థానంలో 7 గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు ఇప్పటికే పాసులు పంపిణీ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం తేలడం ఆలస్యమైతే రెండో సిఫ్ట్‌లో విధులు నిర్వహించేందుకు 50 మంది అదనపు సిబ్బందిని కూడా రెడీగా ఉంచారు.

2129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles