టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ లబ్థిదారులే..

Tue,October 23, 2018 08:03 PM

mla vinay bhaskar says beneficiaries are our star campaigners

నయీంనగర్,(వరంగల్): టీఆర్‌ఎస్‌కు స్టార్ క్యాంపెయినర్స్ సినీ తారలు కాదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారే మాకు స్టార్ క్యాంపెయినర్స్ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని టీఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడారు. వివిధ పథకాల ద్వారా ప్రజలకు లబ్థిచేకూర్చిన సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కోలేక మాహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ప్రజల ముందుకు రాబోతున్నాయని అన్నారు.

ఆ పార్టీల మాయమాటలను నమ్మొద్దని వినయ్ భాస్కర్ కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ సమన్వయ కమిటీలు, వివిధ విభాగాలతో మొదటి దశ ఎన్నికల ప్రచారం పూర్తయిందని వివరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, డిప్యూటి మేయర్ సిరాజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles