కాంగ్రెస్‌ పార్టీ రూ. 50 లక్షలు ఆఫర్‌ చేసింది

Mon,March 4, 2019 01:24 PM

MLA Rega Kantha Rao fire on Uttam and Bhatti Politics

హైదరాబాద్‌ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ రూ. 50 లక్షల చొప్పున ఆఫర్‌ చేసిందని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రేగా కాంతారావు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక వేళ డబ్బులకు అమ్ముడుపోవాలనుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీతోనే రూ. 50 లక్షలు తీసుకునే వాళ్లం కదా? అని రేగా కాంతారావు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తమకు ఎలాంటి డబ్బు ఆఫర్‌ చేయలేదని, కేవలం ఆదివాసీల అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతామని తాము ఇప్పటికే చెప్పామని గుర్తు చేశారు.

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క అసత్యాలు మాట్లాడుతూ.. ఎంతకు అమ్ముడు పోయారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉత్తమ్‌, భట్టి మాట్లాడారని, వారిద్దరూ తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, యాదవరెడ్డిని ఎంతకు కొనుగోలు చేశారని రేగాకాంతారావు ఉత్తమ్‌ను ప్రశ్నించారు. సంఖ్యా బలం లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు. తనతో పాటు ఆత్రం సక్కు, సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరితో కాంగ్రెస్‌ బలం 16కు పడిపోతుందన్నారు. ఉన్న 16 మంది ఎమ్మెల్యేల్లో నాలుగు గ్రూపులున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా అగ్ర నాయకత్వం ఆలోచించాలని రేగా కాంతారావు సూచించారు.

8562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles