అభివృద్ధి కోసమే ఇంటి పార్టీలో చేరాను : రెడ్యానాయక్

Mon,April 16, 2018 01:24 PM

మహబూబాబాద్ : గంజాయి, ఇసుక మాఫియా చేస్తున్నానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తేల్చిచెప్పారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే చెప్పు దెబ్బలు తింటావా అంటూ ఎమ్మెల్యే సవాల్ చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న భూములను కాపాడుకోవడానికే టీఆర్‌ఎస్‌లో చేరానని రేవంత్‌రెడ్డి నిరూపిస్తే ఆయనకే ఆ ఆస్తులను రాసిస్తానని రెడ్యానాయక్ స్పష్టం చేశారు. నిరూపించకపోతే ఆయన ఆస్తులను ప్రజలకు రాసివ్వాలన్నారు. అభివృద్ధి కోసమే ఇంటి పార్టీలో చేరానని చెప్పారు. టీడీపీని మోసం చేసి కాంగ్రెస్‌లో ఎందుకు చేరిండో రేవంత్‌రెడ్డి చెప్పాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్ డిమాండ్ చేశారు.

5123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles