కాంగ్రెస్ రాజకీయాలకు ఎవరూ బలి కావొద్దు

Wed,September 6, 2017 03:15 PM

హైదరాబాద్ : మానకొండూరు నియోజకవర్గంలో మూడెకరాల భూమి పంపిణీలో తలెత్తిన వివాదంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడితే.. దాన్ని సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అంటగట్టి రాజకీయం చేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలకు ఎవరూ బలి కావొద్దని విజ్ఞప్తి చేశారు. మానకొండూరు నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి ఎమ్మెల్యే రసమయి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్‌కు అంటగట్టడం సరైంది కాదన్నారు. దళితుల విషయంలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.


మానకొండూరు ఘటన కలిచివేసింది : రసమయి
మానకొండూరు ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు అత్యధికంగా భూ పంపిణీ చేసిన నియోజకవర్గం మానకొండూరు అని ఎమ్మెల్యే తెలిపారు. మహంకాళి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుంటుంటే పరశురాములు ఆపే ప్రయత్నం చేశారని చెప్పారు. వారిద్దరిని అంబులెన్స్‌లో తానే స్వయంగా తీసుకెల్లి ఆస్పత్రిలో చికిత్స చేయించాను అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆస్పత్రిలో శ్రీనివాస్, పరుశురాములు కోలుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో అత్యధికంగా 910 ఎకరాలు భూమి కొనుగోలు చేసి భూ పంపిణీ చేశామని స్పష్టం చేశారు. దళిత ఎమ్మెల్యేగా దళిత బిడ్డల బాధలు తనకు తెలుసన్నారు రసమయి. మూడెకరాల భూ పంపిణీపై ప్రతిపక్షాలకు అవగాహన లేదన్న రసమయి.. అర్హులైన వారందరికీ భూ పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

1918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles