ఒక్క దొంగ ఓటైనా నిరూపిస్తారా..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా!

Fri,April 19, 2019 08:24 PM

MLA Puvvada Ajay Kumar  slams  Renuka Chowdhury

ఖమ్మం: ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రేణుకాచౌదరి ఓటమి భయంతో తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైనది కాదని, చేతనైతే చేసిన ఆరోపణలను నిరూపించాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. తాను ఒక్క‌టైనా దొంగ ఓటు వేయించినట్లు రేణుకాచౌదరి నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తానని, మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని వీడీఓస్‌ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇరవై సంవత్సరాల నుంచి జిల్లాలో రాజకీయాలు చేస్తున్న రేణుకా చౌదరి వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. చుక్క నీరైన తేగలిగారా అని అన్నారు.

పార్లమెంట్‌ సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుక జిల్లా అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదని, ఎలాగూ ఓడిపోతున్నార‌ని వివిధ సర్వే రిపోర్టులు తేల్చి చెప్పుతున్నందున్న ఓటమిని అంగీకరించలేక తనపై ఆరోపణలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. సీనియ‌ర్ నాయ‌కురాలైన‌ రేణుక నిజనిజాలు తెలుసుకోకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, తన కుమారుని పట్ల అనుచితంగా ప్రవర్తించడం పట్ల బాధ కలిగిందన్నారు. లోక్‌సభ ఎన్నికల రోజున ఖమ్మం నగరంలోని 11వ డివిజన్‌లో గల పోలింగ్‌ బూత్‌లో నా కుమారుడు పోలింగ్‌ ఏజెంట్‌గా ఉన్నాడని, పోలింగ్‌ బూత్‌లోకి వచ్చిన రేణుక తన కుమారుడి పట్ల, నా పట్ల అమర్యాదగా మాట్లాడిందని, అయినా నేను సంయ‌మ‌నం పాటించానని ఎమ్మెల్యే అన్నారు. నా ఓటు, నా భార్య, నా కుమారుడి ఓట్లు ఆ బూత్‌లోనే ఉన్నాయని ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఓటు వేస్తున్నామని ఎమ్మెల్యే అజయ్‌ వెల్లడించారు.


5016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles