నూతన సర్పంచ్‌లతో జగదీష్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం

Fri,February 8, 2019 03:18 PM

MLA Jagadish reddy meet with newly elected sarpanches in suryapet

సూర్యాపేట: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లతో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి నేడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ సర్పంచ్‌లతో జరిగిన ఈ సమ్మేళనానికి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. హరితహారం విజయవంతం చేయడంలో నూతన సర్పంచ్‌లు ముందుండాలని పిలుపునిచ్చారు. నర్సరీలు పెంచేది, మొక్కలు నాటేది, వాటి సంరక్షణను చూసే బాధ్యత ఇకపై గ్రామ పంచాయతీలదేనన్నారు. పచ్చదనంతో పాటు పరిశుభ్రతను కాపాడటంలో గ్రామపంచాయతీల పాత్ర కీలకమన్నారు. పరిశుభ్రతను కాపాడేందుకుగాను సవరించిన పంచాయతీరాజ్‌ చట్టంలో విస్తృస్థాయి అధికారాలను సర్పంచ్‌లకు ఇవ్వడం జరిగిందని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతల నియంత్రణకు చెట్ల పెంపకం అనివార్యమన్నది సర్పంచ్‌లు గుర్తుంచుకోవాలన్నారు. మంచినీటి ఎద్దడిని నివారించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. మిషన్‌ భగీరథ వంటి బృహత్‌ పథకంతో ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికల నిర్మాణాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. నిర్మాణానికి అవసరమైన నిధులు జాతీయ ఉపాధిహామీ పథకంలో తగినంత ఉన్నాయన్నారు.

1488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles