రైతులను పరామర్శించిన హరీష్‌రావు

Tue,April 9, 2019 09:27 AM

mla Harish Rao visits crop damaged areas in siddipet

సిద్ధిపేట: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం అక్కడక్కడా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. సిద్ధిపేట నియోజకవర్గం నంగునూరు మండలంలో రాత్రి వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల వానకు పంటలు, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే హరీష్‌రావు పర్యటించారు. పంట పొలాలను, మామిడితోటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఉదయం 6 గంటల నుంచి నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో హరీష్‌రావు పర్యటిస్తున్నారు.

785
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles